Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడపలో మొదటి సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

Advertiesment
కడపలో మొదటి సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌
, శుక్రవారం, 9 జులై 2021 (19:05 IST)
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామి టెస్ట్‌ ప్రిపరేషన్‌ సేవల సంస్థ ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) భూపాలపల్లిలో తమ మొట్టమొదటి సమాచార కేంద్రాన్ని ఇంటి నెంబర్‌ 1/441–14–1, రెండవ అంతస్థు, మారుతీ నగర్‌, పటేల్‌ రోడ్‌ ఎదురుగా, ఆర్‌టీసీ బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌ రోడ్‌, కడప, ఆంధ్రప్రదేశ్‌ వద్ద ప్రారంభించింది.
 
ఈ సమాచార కేంద్రం వద్ద ఆకాష్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా అది అందించే కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్‌ వద్ద విద్యార్థులు ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సులను సైతం ఎంచుకోవచ్చు.
 
ఈ నూతన సమాచార కేంద్రాన్ని వర్ట్యువల్‌గా శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా, రీజనల్‌ డైరెక్టర్‌; గిరి శ్రీపతి, బిజినెస్‌ హెడ్‌ ప్రారంభించగా, భౌతికంగా శ్రీ సీ హెచ్‌ సుధాకర్‌ రావు, బ్రాంచ్‌ హెడ్‌; ఈ కుమార్‌ రాజా, ఏబీఎం; ఏఓలతో పాటుగా కంపెనీ అధికారులు, ఫ్యాకల్టీ, అతిథులు పాల్గొన్నారు.
 
ఈ ప్రారంభం గురించి శ్రీ ఆకాష్‌ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్న స్థానిక విద్యార్థులకు కడపలోని ఈ కేంద్రం ఓ వరంగా మారనుందన్నారు. దేశవ్యాప్తంగా తమ నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామంటూ ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్‌లకు ఎంపికైన తమ విద్యార్థులే దానికి నిదర్శనమన్నారు.
 
ఆకాష్‌లో చేరగోరు విద్యార్థులు ఇన్‌స్టెంట్‌ అడ్మిషన్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (ఐఏసీఎస్‌టీ) లేదంటే ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్షలలో పాల్గొనవచ్చు. ఐఏసీఎస్‌టీని 8-12 తరగతి విద్యార్థులకు 90% వరకూ స్కాలర్‌షిప్‌ను ట్యూషన్‌ ఫీజుపై అందించేందుకు నిర్వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్టర్డ్‌ ఎక్కౌంటెంట్ల కోసం అభ్యాస వేదికను ప్రారంభించిన హెచ్‌సీఏఎస్‌