Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PMAY-U 2.0 కింద ఇంటిని సరసమైనదిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

Advertiesment
home

ఐవీఆర్

, గురువారం, 12 డిశెంబరు 2024 (20:40 IST)
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 (PMAY-U 2.0) ద్వారా హైదరాబాద్‌లో ఇంటి యాజమాన్యాన్ని మరింత సరసమైనదిగా చేయడానికి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వ కార్యక్రమం గురించి అవగాహనను పెంపొందించడం, తదనంతరం గృహ రుణాలకు సౌకర్యవంతమైన అవకాశాన్ని అందించే లక్ష్యంతో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డిసెంబర్ 12 నుండి 15, 2024 మధ్య తమ శాఖ కార్యాలయంలో స్పాట్ సాంక్షన్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ స్పాట్ సాంక్షన్ క్యాంప్ హైదరాబాదులో నివసిస్తున్న కస్టమర్‌లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం కాకుండా కూకట్‌పల్లి, మహబూబ్‌నగర్, వనపర్తి, షాద్‌నగర్ వంటి చిన్న నగరాల్లో నివసించే జనాభాకు సైతం ప్రయోజనం చేకూర్చనుంది. 
 
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రిషి ఆనంద్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఇంటికి యజమాని కావటానికి అర్హులని మేము విశ్వసిస్తున్నాము. ఇంటి యాజమాన్యం అనేది సుదూర స్వప్నం కాకూడదు, అది అందరికీ చేరుకోగల లక్ష్యం కావాలి. మరీ ముఖ్యంగా సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి. PMAY-U 2.0 పథకం యొక్క ప్రాథమిక రుణ భాగస్వామిగా, మేము వ్యక్తులు, కుటుంబాలకు వారి స్వంత ఇంటి కల చేరుకోవడానికి అవసరమైన వనరులను అందించడం ద్వారా ప్రోత్సహించడానికి అంకితభావంతో ఉన్నాము. మా స్పాట్ సాంక్షన్ క్యాంపులు ఔత్సాహిక గృహయజమానులకు వారి కలల ఇంటిని కొనుగోలు చేసే మొత్తం ప్రక్రియలో అవసరమైన మార్గదర్శకత్వంతో సహాయపడతాయి" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించిన సెన్‌హైజర్, క్రెస్ట్రాన్