Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలీనమైనట్లు వెల్లడించిన 1366 టెక్నాలజీస్‌ మరియు హంట్‌ పెర్వోస్కైట్‌ టెక్నాలజీస్‌

Advertiesment
Hunt Perovskite Technologies
, మంగళవారం, 29 జూన్ 2021 (16:49 IST)
సోలార్‌ పరిశ్రమలో అత్యంత సృజనాత్మక కంపెనీలుగా గుర్తింపు పొందిన 1366 టెక్నాలజీస్‌, ఇంక్‌ (1366) మరియు హంట్‌ పెర్వోస్కైట్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ఎల్‌సీ (హెచ్‌పీటీ)లు తమ వ్యాపారాలను విలీనం చేసినట్లు నేడు వెల్లడించాయి. ఈ విలీనంలో భాగంగా రెండు వైవిధ్యమైన సాంకేతికతలు సైతం విలీనమవుతాయి. ఈ సాంకేతికతలలో 1366 యొక్క డైరెక్ట్‌ వాఫర్‌ ప్రాసెస్‌ మరియు హెచ్‌పీటీ యొక్క ప్రింటెడ్‌ పెర్వోస్కైట్‌ సోలార్‌ ఫోటోవోలటిక్‌ (పీవీ) టెక్నాలజీ ఉన్నాయి.
 
ఈ రెండూ విలీనం కావడం ద్వారా మార్కెట్‌లోకి అత్యంత శక్తివంతమైన టాండమ్‌ మాడ్యుల్స్‌ను తీసుకురావడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సోలార్‌ పరిశ్రమలో అగ్రగామిగానూ నిలువనున్నాయి. విలీనమైన తరువాత కంపెనీని క్యుబిక్‌ పీవీగా పిలుస్తున్నారు. ఇది 25 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ను హంట్‌ ఎనర్జీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎల్‌ఎల్‌సీ (హెచ్‌ఈఈ), ఫస్ట్‌ సోలార్‌ ఇంక్‌ (నాస్‌డాక్‌  ఎఫ్‌ఎస్‌ఆర్‌ఎల్‌), బ్రేక్‌ త్రూ ఎనర్జీ వెంచర్స్‌(బీఈవీ) మరియు ఇతరులు నుంచి అందుకుంది. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో  హెచ్‌ఈఈ చేరనుంది.
 
ఇటీవలనే భారతదేశంలో తమ తయారీ అవకాశాలను అన్వేషించనున్నట్లు 1366 టెక్నాలజీస్‌ నిర్థారించిన సమాచారానికనుగుణంగా ఈ సమాచారం వచ్చింది. క్యూబిక్‌ పీవీగా ఈ కంపెనీ, అతి తక్కువ లెవలైజ్డ్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఎనర్జీ (ఎల్‌సీఓఈ)ను భారతదేశంలో అందించడం మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యధిక సామర్థ్యం కలిగిన మాడ్యుల్స్‌ బ్లూప్రింట్‌ను సైతం ప్రదర్శించనుంది. ఈ రెండు సంస్థల తయారీలోనూ అత్యంత కీలకంగా  డైరెక్ట్‌ వాఫర్‌ ప్రక్రియ ఉంది. ఈ విప్లవాత్మక ఆవిష్కరణ, అత్యున్నత పనితీరు కలిగిన సిలికాన్‌ వాఫర్‌ను నేరుగా మాల్టెన్‌ సిలికాన్‌ నుంచి ఉత్పత్తి చేస్తుంది.
 
‘‘క్రిస్టలిన్‌ సిలికాన్‌ సోలార్‌ తయారీలో తమ ముందు తరం దగ్గర లేనటువంటి ఓ అవకాశం భారతదేశం దగ్గర ఉంది. ఇది వినూత్నమైన ఆవిష్కరణలైనటువంటి డైరెక్ట్‌ వాఫర్‌ ప్రాసెస్‌ను జెనరిక్‌ సిలికాన్‌ సాంకేతికతతో ఎంచుకోవచ్చు. ఈ ప్రయోజనం, తక్షణ ట్రాక్షన్‌ను దేశీయ ఉత్పత్తి మరియు ఎగుమతుల పరిశ్రమకు సైతం మద్దతునందించడం ద్వారా అందిస్తుంది’’ అని ఫ్రాంక్‌ వాన్‌ మియర్లో, సీఈవో- క్యుబిక్‌ పీవీ అన్నారు.
 
‘‘సృజనాత్మకత ఆధారిత సాంకేతికతలైనటువంటి డైరెక్ట్‌ వాఫర్‌ మరియు పెర్వోస్కైట్‌ టాండమ్‌ వంటి వాటి ద్వారా, సోలార్‌ తయారీలో గురుత్వాకర్షణ కేంద్రంగా ఇండియా నిలిచే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. భారతదేశపు దేశీయ వినియోగ మార్కెట్‌కోసం అనుకూలమైన పరిష్కారాలను డైరెక్ట్‌ వాఫర్‌ అందించడంతో పాటుగా ఈ విలీనం అంతర్జాతీయంగా నాయకత్వమూ అందించనుంది’’ అని అన్నారు.
 
ఇప్పటికీ, సోలార్‌ పరిశ్రమ ప్రధానంగా సింగిల్‌ జంక్షన్‌ పీవీ సాంకేతికతపై ఆధారపడటం లేదా ఒకే ఒక్క కాంతి స్వీకరణ మెటీరియల్‌ను వినియోగించడం చేస్తుంది. ఈ పదార్థం తరచుగా సిలికాన్‌ అయి ఉంటుంది మరియు ఇది సూర్యకాంతిని విద్యుత్‌గా మారుస్తుంది. ఈ సాంకేతికత, చిన్న, వృద్ధి చెందుతున్న లాభాల ద్వారా 24% మాడ్యుల్‌  సామర్థ్య పరిమితిని చేరుకుంటుంది. టాండమ్‌ సాంకేతికతను, మల్టీ జంక్షన్‌గా కూడా పిలుస్తుంటారు. ఇది ఒకే ఉపకరణంలో రెండు కాంతి గ్రాహకాలను పొరలుగా ఉంచడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. తద్వారా సింగిల్‌ జంక్షన్‌ఉపకరణాలలో  సామర్థ్యపు అవరోధాలను సైతం విచ్ఛిన్నం చేస్తుంది మరియు తుది ప్యానెల్‌ శక్తి ఉత్పత్తిని 30% వృద్ధి చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ ఇండో-చైనా ఘర్షణలు తప్పవా? 50 మీటర్ల దూరంలో ఇరు బలగాలు