Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్‌ మరణాలను తగ్గించేందుకు హైదరాబాద్‌ పోలీస్‌కు సహాయపడుతున్న హీల్ఫా

కోవిడ్‌ మరణాలను తగ్గించేందుకు హైదరాబాద్‌ పోలీస్‌కు సహాయపడుతున్న హీల్ఫా
, సోమవారం, 28 జూన్ 2021 (22:49 IST)
ప్రజలే లక్ష్యంగా, ఆరోగ్యసంరక్షణ వేదిక హీల్ఫా, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎస్‌సీ)తో చేతులు కలిపి హైదరాబాద్‌ నగర పోలీస్‌ శాఖకు చెందిన కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా అడ్మిషన్లు, మరణాలను తగ్గించింది. తమ కంపానియన్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను మెరుగ్గా వినియోగించుకుని ఆరోగ్య సంరక్షణ ఉపకరణాల సమగ్ర నిర్వహణను హీల్పాతో సాధ్యమవుతుంది. దీని ఫీచర్లలో టెలి కన్సల్టింగ్‌, ఫిజిషీయన్ల చేత పర్యవేక్షణ, యాప్‌ చేత తరచుగా పర్యవేక్షణ చేయడంతో పాటుగా పరీక్షలను సైతం పారామెడిక్స్‌, నర్సుల సహాయంతో రిమోట్‌గా చేస్తుంది.
 
హైదరాబాద్‌ నగర (క్రైమ్స్‌–సిట్‌) అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ శిఖా గోయల్‌, ఐపీఎస్‌ తాను చేసిన ఓ ట్వీట్‌ ద్వారా మాట్లాడుతూ ‘‘ వైద్యులు, ఎన్‌జీఓల చేత అద్భుతమైన సమీక్షా సమావేశం జరిగింది. హీల్ఫాతో మా భాగస్వామ్యం, మా సిబ్బందిలో కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల ఆరోగ్యం జాగ్రత్తగా పర్యవేక్షించడంలో తోడ్పడుతుంది. తద్వారా అడ్మిషన్లు, మరణాలను తగ్గిస్తుంది. ఈ తరహా కమ్యూనిటీ యాప్స్‌ సమాజానికి అత్యంత అవసరమని నమ్ముతున్నాం’’ అని అన్నారు.
 
జనపరెడ్డి రాజ్‌, ఫౌండర్‌ అండ్‌ సీఎస్‌ఓ–హీల్ఫా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘ కోవిడ్‌ వారియర్స్‌లో ఒకరైన పోలీస్‌ వ్యవస్థకు తగిన సహాయం చేయడంలో మా వేదిక విజయవంతమైందనే వాస్తవం, మా యోగ్యతను నిరూపించడమే కాక , రోజువారీ జీవితంలో దాని అవసరాన్ని సూచిస్తుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో వేలాది రోగులకు సేవలు అందించాం. అక్కడ మా వేదిక ప్రజలు మృత్యువాత పడకుండా  చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది’’ అని అన్నారు.
 
ఇప్పటి వరకూ కోవిడ్‌ పోరాటంలో హీల్ఫా, సత్సంగ్‌ కోవిడ్‌ మెడికల్‌ సర్వీస్‌, హెల్ప్‌ హైదరాబాద్‌, ఇండియా కోవిడ్‌ సపోర్ట్‌, ఆర్‌నిసర్గ్‌ ఫౌండేషన్‌లతో కలిసి చురుగ్గా పనిచేసింది. హీల్ఫాను అత్యంత సులభంగా వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సేవలను పాఠశాలలు, కార్పోరేట్‌ సంస్థలు, రెసిడెంట్‌ అసోసియేషన్లు మరియు వ్యక్తిగతంగా కూడా వాడుకోవచ్చు. ఇది సురక్షితమైన, సమర్థవంతమైన, అతి తక్కువ ఖర్చుతో సంరక్షణను అందించడంలో సహాయపడుతుంది. భద్రతకు భరోసానందిస్తూనే వినియోగదారులకు ఆరోగ్య సమాచారం పొందే అవకాశం ఇది అందిస్తుంది. నాణ్యమైన ఆరోగ్యం సమాజానికి అందించడానికి హీల్ఫా సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు...