Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శీతాకాలం... రోజ్ వాటర్‌తో అందం రెట్టింపు...

Advertiesment
శీతాకాలం... రోజ్ వాటర్‌తో అందం రెట్టింపు...
, సోమవారం, 31 డిశెంబరు 2018 (17:14 IST)
సాధారణంగా స్త్రీలు పూలు అంటే చాలా బాగా ఇష్టపడతారు. దేవుని పూజకు, డెకరేషన్స్ చేయడానికి, రోజా పూలను ఎంతగానో ఉపయోగిస్తారు. సౌందర్య లేపనంగా వాడటానికి రోజా పూలు ప్రముఖపాత్ర వహిస్తాయి. వీటితోటి రకరకాల క్రీములు, అత్తరులు, రోజ్ వాటర్ తయారు చేస్తారు. ఈ రోజ్ వాటర్ వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సౌందర్యానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అది ఎలాగో చూద్దాం.
 
1. రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడతలను మరియు మచ్చలను నివారిస్తుంది. అయితే కళ్ళలో రోజ్ వాటర్ పడకుండా చూసుకోవాలి.
 
2. మొటిమలు మరియు మచ్చల వల్ల చర్మం దురదగా అనిపిస్తుంటే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది.
 
3. జాస్మిన్ ఆయిల్లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ శరీరానికి అప్లై చేయడం వల్ల, శరీరం యొక్క దుర్వాసనను తొలగించుకోవచ్చు.
 
4. రోజ్ వాటర్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు మాయమవుతాయి.
 
5. తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. 
 
6. మొటిమలు ఉన్నవారు రోజూ గులాబీ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకో గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగితే..?