అదే పనిగా ముఖాన్ని కడుక్కుంటుంటే.. చర్మంపై నూనె గ్రంథులు తొలగిపోయి ముఖం పొడిబారుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎక్కువగా చల్లగా ఉన్న నీటిని వాడకూడదు. అందుకని మరీ వేడిగా ఉన్న నీటిని తీసుకోరాదు. కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితో కడుక్కుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
పొడిబారిన చర్మానికి పాలలో కొద్దిగా పెరుగు, తేనె, పసుపు కలిపి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. అలాకాకుంటే అరటిపండు తొక్కను పొడిచేసుకుని అందులో కొద్దిగా వంటసోడా, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం పొడిబారకుండా ఉంటుంది.
ముఖ్యంగా ముఖం కడుక్కోవడానికి మేకప్ వేసుకోవడానికి ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతుల్లోని బ్యాక్టీరియా ముఖంపై మెుటిమలు ఏర్పడేలా చేస్తాయి. దాంతో ముఖం అందాన్ని కోల్పోతుంది.