సాధారణంగా కొందరి ఇంట్లో అంతగా రొయ్యలతో వంటకాలు ఎక్కువగా చేసుకోరు. ఎందుకంటే రొయ్యల్లోని పై తోలును తీసేందుకు చాలా కష్టపడుతుంటారు. రొయ్యలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొవ్వులను బయటకు పంపుతాయి. ఇటువంటి రొయ్యలతో సూప్ ఎలా చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
రొయ్యలు - 30 గ్రాములు
ఆలివ్ ఆయిల్ - 5 స్పూన్స్
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 10 గ్రాములు
కొత్తిమీరు - 1 కట్ట
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెలో పోసి వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రంలో రొయ్యలు వేసి వేయించి నీళ్లు పోసి కారం, ఉప్పు వేసి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే రొయ్యల సూప్ రెడీ.