Publish Date: Fri, 29 Nov 2019 (20:25 IST)
Updated Date: Fri, 29 Nov 2019 (20:26 IST)
టీనేజ్ అమ్మాయిలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. వీటితో ముఖ సౌందర్యం పాడైపోతుంది. దీంతో పదిమందిలో తిరగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని దూరం చేసుకోవాలంటే..
1. పుదీనాను రుబ్బుకుని మొటిమలకు రాయండి. ఇలా 15 రోజులపాటు ప్రతి రోజూ అరగంటపాటు పూస్తే ఉపశమనం కలుగుతుంది.
2. తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది.
3. ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమలనుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
4. ప్రతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు వేపనూనెతో తయారు చేసిన సబ్బును వాడండి లేదా నాలుగు చుక్కలు డెటాల్ కలుపుకుని స్నానం చేయండి. దీంతో ముఖంపై నున్న మొటిమలు తొలగిపోతాయి.
5. చందనపు పేస్ట్‌లో గులాబీ జలాన్ని (రోజ్ వాటర్) కలుపుకుని మొటిమలపై పూయండి. ఈ లేపనాన్ని కనీసం అరగంట ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా ప్రతి 15 రోజులపాటు చేయండి. ఈ 15 రోజులలో మొటిమలను దూరం చేసుకోవచ్చు.