జామ ఆకులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇందుకు కావల్సినవి ఏంటంటే.. జామ ఆకులు ఓ పది, నిమ్మరసం ఓ రెండు స్పూన్లు, పాలు మూడు టీ స్పూన్లు, రోజ్ వాటర్ రెండు టీ స్పూన్లు.
ముందుగా జామ ఆకులను శుభ్రపరిచి నీటిలో ఉడికించుకోవాలి. ఆపై ఆ ఆకులను బాగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసం, పాలు, రోజ్ వాటర్ చేర్చుకోవాలి. అంతే జామ ఆకుల ఫేస్ ప్యాక్ రెడీ.
ఈ ఫేస్ ప్యాకును రోజూ ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మానికి నిగారింపు సంతరించుకుంటుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను రోజూ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం సౌందర్యం మెరుగుపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లైనా ముఖానికి పట్టిస్తే.. మంచి ఫలితం వుంటుంది.