పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? ఐతే కొత్తిమీర రసాన్ని?
పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? అయితే కొత్తిమీర రసాన్ని ఇలా వాడండి. పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉ
Publish Date: Fri, 06 Oct 2017 (09:36 IST)
Updated Date: Fri, 06 Oct 2017 (10:03 IST)
పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? అయితే కొత్తిమీర రసాన్ని ఇలా వాడండి. పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపు రంగు మారి... ఎరుపు రంగు సంతరించుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ ఉంటే మార్పును వెంటనే చూడొచ్చు.
ఇక చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూన్ ఉల్లిరసం, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
selvi
Publish Date: Fri, 06 Oct 2017 (09:36 IST)
Updated Date: Fri, 06 Oct 2017 (10:03 IST)