Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందార ఆకులతో సౌందర్యం..

మందార ఆకులతో సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మందార నూనెను వెంట్రుకలను కాపాడటంలో భేష్‌గా పనిచేస్తుంది. మందార నూనెలో వుండే తేమ చర్మానికి, కేశాలను మృదువుగా ఉండేట్లు చేస్తుంది. మందార నూనెను కేశాలకు రాస్త

మందార ఆకులతో సౌందర్యం..
, మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:08 IST)
మందార ఆకులతో సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మందార నూనెను వెంట్రుకలను కాపాడటంలో భేష్‌గా పనిచేస్తుంది. మందార నూనెలో వుండే తేమ చర్మానికి, కేశాలను మృదువుగా ఉండేట్లు చేస్తుంది. మందార నూనెను కేశాలకు రాస్తే.. కేశాలు మెరిసిపోతాయి. ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు. జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
జుట్టు తెలబడకుండా చేయడంలో మందార నూనె గొప్పగా పనిచేస్తుంది. అలాగే మందార నూనెను రాయడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంలో మృత కణజాలం లేకుండా చూస్తుంది. స్నానానికి వెళ్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది. పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..