Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘మేం తటస్థంగానే ఉంటాం’- రష్యా హామీలకు స్పందనగా యుక్రెయిన్ హామీ

‘మేం తటస్థంగానే ఉంటాం’- రష్యా హామీలకు స్పందనగా యుక్రెయిన్ హామీ
, మంగళవారం, 29 మార్చి 2022 (23:01 IST)
యుక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను గణనీయంగా తగ్గిస్తామని రష్యా హామీ ఇవ్వగా.. అందుకు ప్రతిగా తాము తటస్థ స్థితిని కొనసాగిస్తామని యుక్రెయిన్ హామీ ఇచ్చింది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన శాంతి చర్చల్లో ఇది చాలా ముఖ్యమైన పురోగతి అని ఇస్తాంబుల్‌లోని బీబీసీ ప్రతినిధి టామ్ బాట్‌మాన్ చెప్పారు.

 
తటస్థ స్థితి అంటే నాటోలో కానీ, ఏ ఇతర సైనిక కూటములలో కానీ యుక్రెయిన్ చేరదు. అలాగే, తమ దేశంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు ఏ దేశానికీ అనుమతి ఇవ్వదు. గతంలో నాటోలో చేరతామని యుక్రెయిన్ ప్రకటించింది. ఈ విజ్ఞప్తిని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది.

 
కాగా, రష్యా కలుపుకున్న క్రైమియా అంశంపై 15 ఏళ్ల సంప్రదింపుల సమయం ఉండాలని, అప్పటి వరకూ రష్యా ఎలాంటి కాల్పులూ జరపకూడదని.. ఆ గడువు ముగిసిన తర్వాత క్రైమియా పరిస్థితిపై నిర్ణయం ఉంటుందని యుక్రెయిన్ షరతు విధించింది. రష్యా అధ్యక్షుడు జెలియన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య ప్రత్యక్ష సమావేశానికి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించింది.

 
అయితే, రష్యా సమాధానం కోసం తాము ఎదురుచూస్తున్నామని యుక్రెయిన్ ప్రతినిధులు చెప్పారు. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల కోసం టర్కీలో సమావేశయ్యారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ రాజధాని నగరం కీయెవ్, మరొక నగరం చెర్నిహివ్‌లపై దాడులను గణనీయంగా తగ్గిస్తామని రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ హామీ ఇచ్చారు. యుక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య ఇస్తాంబుల్‌లో మూడు గంటల పాటు చర్చలు జరిగాయి.

 
అనంతరం రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు యుక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడులను తగ్గిస్తామని చెప్పారు. అలాగే, ఇరు దేశాల మధ్య లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమే అంతిమ లక్ష్యం అని, దాని కోసం తాము తీసుకునే చర్యలు సహకరిస్తాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ప్రచారకర్తగా నూతన టీవీసీ విడుదల చేసిన ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌