Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత: ‘‘విడాకులు తీసుకుంటున్నప్పుడు నీకు ఐటమ్ సాంగ్ ఎందుకు అన్నారు... నా ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు’’

Samantha
, గురువారం, 30 మార్చి 2023 (22:08 IST)
సినీనటి సమంత తన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం మీద తాను తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు తెలిపారు. సమంత నటించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'మిస్‌మాలిని' అనే వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడారు. పుష్ప సినిమాలో ''ఊ అంటావా మామ... ఊహు అంటావా మామ...'' అనే పాటలో నటించడం గురించి, ఆ పాట ఒప్పుకున్నందుకు వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు సమంత.
 
''ఒక గొప్ప సినిమాలో నటిస్తున్నప్పుడు, దేశంలోని గొప్ప డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్‌తో చేస్తున్నప్పుడు భయం ఉంటుంది. అల్లు అర్జున్ డ్యాన్స్ చేసేటప్పుడు, ఇక ఎవరూ కనిపించరు. అందుకే ఎక్కువ కష్టపడ్డాను'' అని సమంత అన్నారు. ''ఆ సినిమా చెయ్యి... ఈ సినిమా చేయకు...'' అంటూ మీకు ఎవరైనా సలహాలు ఇస్తారా? ప్రశ్నించినప్పుడు సమంత ఇలా స్పందించారు. ''మేం విడిపోతున్న సమయంలో ఊ అంటావా... అనే పాట వచ్చింది.
 
నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా ఇంట్లో వాళ్లు అందరూ నన్ను ఇంట్లో కూర్చొమన్నారు. విడాకులు తీసుకుంటున్నానని అందరికీ చెప్పిన నువ్వు ఇప్పుడు ఐటం సాంగ్ చేయకూడదు అని వారు అన్నారు. ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసే నా స్నేహితులు... నువ్వు చేయగలవు నీకు నీవు సవాల్ చేసుకో అంటూ చెప్పే వారు కూడా.. ఆ సమయంలో నో అన్నారు. ఐటమ్ సాంగ్ వద్దు అన్నారు.
 
కానీ నేను చేస్తాను అన్నాను. నేనేమీ తప్పు చేయనప్పుడు, నేనెందుకు దాక్కోవాలి? ట్రోలింగ్స్ ఆగేంత వరకు వేచిచూసి, ఏదో నేరం చేసిన దానిలా ఆ తర్వాత మెల్లగా బయటికి రావాలనుకోలేదు. 100 శాతం నా పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చాను. కానీ అది వర్కవుట్ కాలేదు. అంతేకానీ నేను ఏమీ చేయని దానికి నన్ను నేను ఎందుకు శిక్షించుకోవాలి? నాకు పాటలోని లిరిక్స్ నచ్చాయి. అది డిఫరెంట్ క్యారెక్టర్‌గానే అనిపించింది. నేను ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు అనిపించలేదు. ప్రతి కొత్త దాన్ని ట్రై చేయాలని అని అనుకున్నా. నా జీవితంలోని ఓటములు, బలహీనతలు వంటివి అందరికీ చెబితే అవి ఎవరికొకరికి ఉపయోగపడతాయని భావించా. ఒకశాతం మందికి లాభం చేకూరినా చాలు'' అని సమంత తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క యేడాదిలో 8428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి!