Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

Advertiesment
Moringa Soup

సెల్వి

, సోమవారం, 1 డిశెంబరు 2025 (22:08 IST)
Moringa Soup
శీతాకాలంలో మహిళలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి వారానికి రెండుసార్లైనా మునగాకు సూప్ తీసుకోవడం మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులోని ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి. మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం సహజంగా కొవ్వును కరిగిస్తుంది. 
 
రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. అలానే జీర్ణశక్తిని ఇది మెరుగుపరుస్తుంది. ఉదర రుగ్మతలకు చెక్ పెడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంటాయి. 
 
అలాగే మునగలోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఈ ఆకులోని అమైనో యాసిడ్స్ కెరోటిన్ ప్రోటీన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ ప్రోటీన్ జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్