నోటి పుండుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే నెయ్యిని వాడండి. నోటి అల్సర్‌ను నెయ్యి దివ్యౌషధం. పదే పదే ఇబ్బంది పెట్టే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంపై ఆ ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ పుండ్లు నాలుక, చిగుళ్లు, దవడ లోపలి భాగం, పెదవుల లోపలి వైపు ఏర్పడతాయి. ఆహారాన్ని తీసుకోవడానికి వీల్లేకుండా బాధిస్తాయి. ముందుగానే వాటిని గుర్తిస్తే తేలిగ్గా బయటపడొచ్చు.
అలాగే నోటి అల్సర్‌ను దూరం తచే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. కరక్కాయను పొడి చేసి, గ్లాసు నీటిలో కలిపి, ఈ కషాయంతో ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి. పటికను చిన్నచిన్న ముక్కలుగా చేసి మూకుడులో వేడి చేయాలి. ఇందులోని నీరంతా ఆవిరైపోయాక మెత్తని భస్మంలా చేసుకుని భద్రపరుచుకోవాలి.
అరచెంచా పొడిని గ్లాసు నీటిలో కలిపి, దీంతో పుక్కిలిస్తే నోట్లో పుండ్లు తగ్గుతాయి. పేరిన నెయ్యిని అప్పుడప్పుడు ఈ పుండ్లపై రాస్తూ ఉంటే, ఉపశమనంగా ఉంటుంది. అరచెంచా ఉసిరి చూర్ణాన్ని తేనెతో కలిపి మూడు పూటలు తీసుకున్నా ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.