Publish Date: Tue, 02 Jul 2019 (12:24 IST)
Updated Date: Tue, 02 Jul 2019 (12:26 IST)
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీలు త్రాగే అలవాటు ఉంటుంది. అది లేనిదే బెడ్ మీద నుండి లేవరు. కానీ ఈ అలవాటు అంత మంచిది కాదు. టీ కాఫీలకు బదులుగా ఉదయం లేవగానే పరగడుపున రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి త్రాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ దీనిలో ఎంత మాత్రం నిజం లేదు.
నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది.