నెలసరి సమస్యలకు జీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుందట.. పాలు, జీలకర్ర పొడిని?
జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర.. గ్యాస్ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాల్షియం, ఇనుము
జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర.. గ్యాస్ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాల్షియం, ఇనుము లోపించినప్పుడు బాలింతల్లో పాల కొరత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జీలకర్రను ఏ రూపంలో తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఫలితంగా అధిక బరువునీ అదుపులో ఉంచుకోవచ్చు. గ్యాస్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
* మహిళల్లో రక్తహీనతకు జీలకర్ర చెక్ పెడుతుంది. శరీరంలో ఇనుము లోపించడం వల్ల ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటివారికి జీలకర్ర చక్కని పరిష్కారం. శరీరంలో రక్తనిల్వల్ని పెంచడంలో జీలకర్ర చక్కని ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, అది చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది
*విటమిన్ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.