Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు...

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్

Advertiesment
Snake bite First Aid
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (20:45 IST)
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నాయి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.
 
కరిచిన పాము విషపుదా, మామూలుదా….? అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే… కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.
 
విషపు పాము కరిచిన వెంటనే…. కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండుమూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ఎం.ఎల్ నుండి 2 ఎం.ఎల్ వరకు మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200ను 5 ఎంఎల్ బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3సార్లు వేస్తే… పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాలకుల ఆయిల్ మసాజ్‌తో.. లైంగిక స్పందన పెరుగుతుందట..