Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్లాక్ కాఫీలో నల్ల మిరియాల పొడిని వేసుకుని తాగితే రుతుక్రమ ఇబ్బందులకు చెక్..

నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. బ్లాక్

Advertiesment
Black coffee with pepper powder
, గురువారం, 13 అక్టోబరు 2016 (17:04 IST)
నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాల పొడి వేసుకుని తాగితే రుతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రుతుక్రమ ఉదర సంబంధిత నొప్పులు, కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఇక సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొల్రెస్టాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుంది.  
 
అలాగే లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు. 
 
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి యాలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గాలనుకుంటున్నారా? రెండు గ్లాసులు నీళ్లే చాలు..