Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు తగ్గాలనుకునే వారు.. జీరా నీరు తాగితే..?

బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేదా..? ఐతే ఇక జీరాను అదేనండి జీలకర్రను నమ్ముకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ ఏదో రూపంలో జీరాను ఆహారంలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చునని

Advertiesment
బరువు తగ్గాలనుకునే వారు.. జీరా నీరు తాగితే..?
, బుధవారం, 18 జులై 2018 (10:58 IST)
బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేదా..? ఐతే ఇక జీరాను అదేనండి జీలకర్రను నమ్ముకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ ఏదో రూపంలో జీరాను ఆహారంలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
జీలకర్రలో మాంగనీస్‌, ఐరన్‌, పొటాషియం, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. అధిక ప్రోటీన్లున్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే.. ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది. జీరాలోని ఫైబర్ కణాల కదలికకు తోడ్పడుతుంది. 
 
శరీరంలో నీరు వుంటే ఊబకాయం తప్పదు. అలాంటి తరుణంలో జీరా నీటిని సేవించడం చేయాలి. జీరాలో థైమోల్‌ అనే కాంపౌండ్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుచేత ఒక గ్లాసు నీటిలో జీరా ఓ స్పూన్ చేర్చి ఆ నీటిని అరగంట తర్వాత తాగితే మంచి ఫలితం వుంటుంది. అలాగే జీలకర్ర రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. 
 
బరువు తగ్గాలనుకునేవారు సాధారణంగా తీసుకునే నీటిలో జీరాను కలిపి తీసుకోవాలి. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలపొచ్చు.

చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తాగొచ్చు. భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండెపోటుకే కాదు లావు పెరగడానికి దారితీసే గురక...