Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31.12.2023 నుంచి 06.01.2024 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
weekly horoscope
, శనివారం, 30 డిశెంబరు 2023 (14:20 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
అనుకూలతలు నెలకొంటాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కళాత్మక పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. గురువారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయుల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆది, సోమవారాల్లో పనుల్లో జాప్యం, చికాకులు అధికం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ప్రతికూలతలను అధిగమిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆప్తుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. క్రీడా, కళాత్మక పోటీలు ఉల్లాసాన్నిస్తాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. రాబడిపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. శనివారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గుట్టుగా వ్యవహరించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వేడుకకు హాజరవుతారు. ఆలయాలు సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ నొప్పించవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. సోమ, మంగళవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ ఆధిపత్యం కొనసాగుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అంచనాలను భిన్నంగా ఉంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. బుధవారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బాధ్యతగా మెలగాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. దంపతుల మధ్య దాపరికం తగదు సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. పత్రాలు అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. సాంకేతిక, ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఈ వారం గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగువేయాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు స్థానచలనం. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. గురువారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు సమయం కాదు. ఉద్యోగస్తులకు శుభయోగం. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ధనప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అవివాహితులకు శుభసూచకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారి ఆదాయం బాగుంటుంది. క్రీడ, కళాత్మక పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-12-2023 శనివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన శుభం...