Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-11-2021 నుంచి 13-11-2021 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
07-11-2021 నుంచి 13-11-2021 వరకు మీ వార రాశిఫలాలు
, ఆదివారం, 7 నవంబరు 2021 (20:58 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. ఎవరినీ నిందించవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. బుధవారం ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగుస్తాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆదాయం బాగుంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో నగదు, పత్రి అప్పగించవద్దు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పదవుల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు హోదామార్పు. వృత్తుల వారికి ఆశాజనకం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2 3, 4 పాదములు 
లక్ష్యాన్ని సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ చిత్తశుద్ధికి ప్రశంసలందుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మంగళ, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సంతానం చడువులపై శ్రద్ధ వహించండి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదవకాశాలు లభిస్తాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యాత్నాలు సాగిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక వ్యవహారంలో
మీ జోక్యం అనివార్యం. గృహమరమ్మతులు చేపడతారు. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్ధయాత్రకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి శ్రమ. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉతర 2, 3, 4 పాదములు, పొన్న చిత 1 2 పాదములు 
ఈ వారం కలిసి వచ్చే సమయం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. సమర్ధతను చాటుకుంటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితమిస్తాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఓర్పుతో వ్యవహరించండి. నిస్తేజానికి లోనుకావద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. మీరంటే గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. విదేశీయాన యత్నాలు విరమించుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. శుభమూలక ఖర్చులే ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. అందరితో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండౌ పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. శ్రమించినా ఫలితం ఉండడు. అశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ అశక్తతను అయినవారు అర్థం చేసుకుంటారు. ఈ ప్రతికూలతలు తాత్కాలికమే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్మికులకు పనులు లభిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్రవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతకాలు, ఒప్పందాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. అవివాహితులకు శుభసూచకం. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, వెంచర్లు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వస్త్ర ప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. అనుకోకుండా అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆది, శనివారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉంచాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాభివృద్ధికి ప్రణాలికలు వేసుకుంటారు. చిన్న వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సోదరులతో అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. పందాలు, జూదాల జోలికి పోవద్దు. 
 
మీనం : పూర్వాబాధ్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. రోజులు భారంగా గడుస్తున్నట్లనిపిస్తాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సోమ, మంగళ వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారా శ్రేయస్కరం. వాహనచోదకులకు దూకుడు తగదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-11-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా శుభం...