Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-11-2021 మంగళవారం దినఫలాలు

Advertiesment
02-11-2021 మంగళవారం దినఫలాలు
, మంగళవారం, 2 నవంబరు 2021 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులు శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. పాత లక్ష్యాలు నెరవేరుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఇచ్చుపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ఆత్మీయుల కలయిక వల్ల మానసికంగా కుదుటపడతారు. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు పథకాల వైపు దృష్టి మళ్లిస్తారు.
 
వృషభం :- వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. పరిచయాలు సంతృప్తినిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఖర్చులు అంచనాలు మించుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
మిధునం :- ఆర్థికపరమైన చర్చలు, సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆస్పత్రి, బిల్లులు, పెన్షన్, గ్రాట్యుటీ, వ్యవహారాల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి.
 
కర్కాటకం :- తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. వాణిజ్య రంగాల వారికి అనుకూలమైన కాలం. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. యువకులకు అందిన ఒక సమాచారం సంతృప్తినిస్తుంది. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు.
 
సింహం :- ఆర్థికస్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలల పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన కుదిరినా, తోటివారి ధోరణి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మెళకువ అవసరం.
 
కన్య :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు అలసట, అధికశ్రమ తప్పదు. అధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరంలోవున్న బంధు మిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
తుల :- శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామిక చర్చలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేరు.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీల అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. కొన్ని సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో అందోళన చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. విదేశీ వస్తువులు సేకరిస్తారు.
 
ధనస్సు :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ట్రాన్సుపోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. విలువలకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి.
 
మకరం :- చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల రాకపోకల వల్ల ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతారు. 
 
కుంభం :- జీవితం ఆనందంగా గడచిపోతున్నప్పటికీ, మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు.
 
మీనం :- కొన్ని పనులు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకుంటారు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి మీ అభిమానం చాటుకుంటారు. సోదరీ సోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-11-2021 సోమవారం దినఫలాలు - శివారాధన వల్ల మనశ్శాంతిని...