Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-03-2022 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం

10-03-2022 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం
, గురువారం, 10 మార్చి 2022 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ప్రేమికులు పెద్దల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
వృషభం :- స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఉద్యోగస్తులు అధికారుల మనస్థత్వం తెలిసి మసలు కొనుట మంచిది. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహరాలు ఏమాత్రం ముందుకు సాగవు.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం. అప్పుడప్పుడుకాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. దూర ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు, చిరువ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కన్య :- విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్ట్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ఆకస్మికంగా దూరప్రయాణాలు వాయిదా పడతాయి. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం.
 
తుల :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒకకార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. లాయర్లు ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. వీపై వచ్చిన అభియోగాలు, అపవాదులు తొలగిపోగలవు.
 
వృశ్చికం :- జాయింట్ వెంచర్లు, ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. పన్నులు, వాయిదా బకాయిలు సకాలంలో చెల్లిస్తారు.
 
ధనస్సు :- బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.
 
మకరం :- పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. విలాసాలకు ధనం బాగా వెచ్చించి ఆ తరువాత ఆందోళన చెందుతారు. ప్రతి విషయంలోనూ స్వయంశక్తినే నమ్ముకోవటం ఉత్తమం.
 
కుంభం :- మీ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు సమయం కలిసివస్తుంది. ఏ వ్యవహారంలోను సొంత నిర్ణయాలు తీసుకోకుండా అందరినీ సంప్రదించటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, దాన ధర్మాలకు ఖర్చులు చేస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మీనం :- కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థుల్లో భయం తొలగి మానసిక ధైర్యం నెలకొంటుంది. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. హామీలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. పాత మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏంటది?