Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-06-2023 శుక్రవారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల సర్వదా శుభం..

Advertiesment
Scorpio
, శుక్రవారం, 30 జూన్ 2023 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి పార్టీ వారితోగాని కార్యకర్తలతోగాని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గుడుపుతారు.
 
వృషభం :- మీ ఏమరుపాటుతనం వల్ల ధననష్టం, విలువైన వస్తువులు చేజారిపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు. కుటుంబీకులు, బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది.
 
మిథునం :- వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలలో ఉల్లాసంగా గడుపుతారు. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన, మెళుకువ అవసరం. మీ శ్రీమతి వైఖరి విసుగు కలిగిస్తుంది. బంధు మిత్రుల వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది.
 
కర్కాటకం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించడి. స్త్రీలు ఒత్తిళ్ళు, మొహమాటాలకు పోవటం వల్ల ఇబ్బందులెదుర్కోకతప్పదు. మీ సంతానం విలాసాలకు ధనం బాగుగా వ్యయం చేస్తారు. రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
సింహం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరచయాలేర్పడతాయి.
 
కన్య :- బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. కుటుంబీకులతోకలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితులతో కలసి సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు టివి ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసి వస్తాయి. సాహసకృత్యాలు, ప్రయోగాలకు దూరంగా ఉండాలి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం :- ఎండుమిచ్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సంతానంపై చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
మకరం :- మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. చిరకాల ప్రత్యర్ధులు మిత్రులుగా మారతారు.
 
కుంభం :- స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి పొందుతారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రజాదరణ అధికంగా ఉంటుంది.
 
మీనం :- స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-06-2023 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...