Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

Advertiesment
astro2

రామన్

, మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ పూర్ణిమ తె.4.19 చిత్త రా.9.52 ఉ.శే.వ.6.05కు, తెల్లవారుజామున 3.54 ల 5. 38. ఉ.దు.8.24 ల 9.12 రా.దు. 10.52ల11.39.
 
మేషం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
వృషభం :- గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోవారికి శుభం చేకూరుతుంది. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు చక్కగా నిర్వహిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు. ప్రతీ విషయంలోను ఆలోచించి నిర్ణయం తీసుకోవడంమంచిది. గత కొంత కాలంగా అనుభవిస్తున చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
 
సింహం :- ఆర్థికంగా పురోగమిస్తారు. సంఘంలో మీ మాట పై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు. నిరుద్యోగులకు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
కన్య :- రాజకీయ నాయకులు అధికంగా ఆలోచించడం వల్ల ఆందోళనలకు గురవుతారు. ఏజెంట్లు బ్రోకర్లు, రిప్రజెంటిటివ్‍‌లకు మిశ్రమ ఫలితం. ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికఫలిస్తుంది. మీ సంకల్పసిద్ధికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
 
తుల :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. దైవకార్యాలో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదోగ్యస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్తిస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు స్థానమార్పి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ భాంధవ్యాలు బాగా ఉంటాయి.
 
ధనస్సు :- ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళకలు పథకాలు సత్ఫలితాలనిస్తాయి.
 
కుంభం :- కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి చివరిలో విదేశీ పర్యటనలు ఉంటాయి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. విలాస జీవితాన్ని గడుపుతారు. ముందు చూపుతో వ్యవహరించండి.
 
మీనం :- ఆర్థికపరమైన అనుకూలతలు కొనసాగుతాయి. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. బంధువుల మధ్య సంభంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అదనపు భారములను వాయిదా వేయడం మంచిది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి, చికాకులు వంటివి తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..