Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-07-2024 శనివారం రాశిఫలాలు - ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది....

astro5

రామన్

, శనివారం, 20 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ చతుర్ధశి సా.5.20 పూర్వాషాఢ రా.2.25 ప.వ.12.04 ల 1.40. ఉ.దు. 5.34 ల 7.17.
 
మేషం :- ఉద్యోగస్తులకు రావలసిన అరియర్స్, అడ్వాస్సులు మంజూరవుతాయి. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. కార్మికులకు, పారిశ్రామికులకు పరస్పర అవగాహన కుదురుతుంది.
 
వృషభం :- ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు.
 
మిథునం :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి.
 
కర్కాటకం :- వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించటం క్షేమదాయకం.మీ పనితీరును, వ్యవహార దక్షతలను ఎదుటివారు గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సఖ్యత నెలకొంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
సింహం :- ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారితో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి.
 
కన్య :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు.
 
తుల :- రాజకీయలలోని వారు విరోధులు వేసే పథకాలను త్రిప్పి కొడతారు. కాంట్రాక్టర్లకు అధికారులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ప్రియతముల గురించి అప్రియమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం వహించుట వలన మాటపడవలసి వస్తుంది.
 
వృశ్చికం :– దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు మెళకువ అవసరం. అంతర్గత సమస్యలను అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటు తప్పదు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం.
 
ధనస్సు :- రుణ విమోచన విషయాలు చర్చిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణముల యందు చెడుస్నేహాల వల్ల ఒకింత చికాకులు తప్పవు. బంధువులతో సత్సంబంధాలు సన్నగిల్లుతాయి. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. ధనవ్యయం అధికమవుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు.
 
మకరం :- వృత్తి ఉద్యోగముల యందు గౌరవంతో నడుచుకోగలుగుతారు. ప్రేమ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన అధికమగును. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
కుంభం :- ఉద్యోగస్తుల శక్తిసామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఆధ్యాత్మిక సమావేశాలు, సభలలో పాల్గొంటారు. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థులలో ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం చోటుచేసుకుంటాయి.
 
మీనం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాలలో వారికి సత్కాలం. గృహంలో శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కార్మిక సమస్యలు అధికమవుతాయి. వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-07-2024 శుక్రవారం రాశిఫలాలు - వ్యాపారా లావాదేవీలు ప్రోత్సహకరంగా ఉంటాయి....