Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18-07-2024 గురువారం దినఫలాలు - కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం...

astro3

రామన్

, గురువారం, 18 జులై 2024 (04:01 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ ద్వాదశి సా.6.13 జ్యేష్ఠ రా.2.09 ఉ.వ.7.07 ల 8.46. ఉ.దు. 9.53 ల 10.45 ప.దు. 3.06ల 3.58.
 
మేషం :- ఉమ్మడి నిధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ఆరోగ్యంలో ఆందోళనలు ఎదురవుతాయి. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.
 
వృషభం :- కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితులకు, ఆత్మీయులకు బహుమతులు అందజేస్తారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. దైవ దీక్షాకార్యక్రమంలో పాల్గొంటారు. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి.
 
మిథునం :- ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్లఆశక్తి పెరుగుతుంది. విద్యార్ధులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయండి. పుణ్యక్షత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం :- ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాల్లో ప్రతికూలత ఎదురుకావచ్చు. గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. స్త్రీలు షాపింగ్, విందు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. రావలసినబాకీలు వసూలవుతాయి.
 
సింహం :- దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
కన్య :- మీ సంతానం విద్యా విషయమై ప్రముఖులతో చర్చిస్తారు. పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. బదిలీలు, మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యన్ని కలిగిస్తాయి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతోముఖ్యం.
 
తుల :- రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మనుషుల మనస్తత్వం తెలిసి మసలు కొనుట మంచిది.
 
వృశ్చికం :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్ధికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. 
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మీ ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆత్మీయులకోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
మకరం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
కుంభం :- మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మీనం :- సాహస ప్రయత్నాలు విరమించండి. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదా పడును. స్త్రీలు వస్త్రములు, ఆభరణాలు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సొంతంగా గాని, భాగస్వామ్యంగా గాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-07-2024 బుధవారం దినఫలాలు - ఉద్యోగస్తులకు అధికారులు నుంచి మంచి గుర్తింపు...