Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-11-2022 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన...

Advertiesment
Weekly Astrology
, శనివారం, 19 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చకండి. విందులలో పరిమితి పాటించండి.
 
వృషభం :- స్త్రీలకు పుట్టింటి నుంచి శుభవార్తలు అందుతాయి. రుణవిముక్తులు కావటంతో పాటుతాకట్టు విడిపించుకుంటారు. వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తప్పవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
మిథునం :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. 
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
సింహం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసివస్తుంది. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి వారి ఆదరణ పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. సోదరీ, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి.
 
కన్య :- విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. రాజకీయనాయకులు సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలలో ధనం బాగా వెచ్చించినా ప్రయోజనకరంగా ఉంటుంది.
 
తుల :- బీమా, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. క్రీడ, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రేమికులకు మధ్య ఊహించని స్పర్ధలు తలెత్తుతాయి. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించవు. కుటుంబంలో ఊహించని చికాకు లెదురవుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
ధనస్సు :- స్త్రీలు స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. పరిశ్రమలు, సంస్థలకు కావలసిన లైసెన్సులు, పర్మిట్లు మంజూరు కాగలవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
మకరం :- మీ మాటతీరు, ప్రవర్తనలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
కుంభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధికమవుతుంది. ఉదోగ్యస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. పాత మొండిబాకీలు వసూలవుతాయి.
 
మీనం :- మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులకు జ్ఞాపకశక్తి కొంత మందగించడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. స్త్రీలకు బంధువుల రాక అసహనం కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి శనివారం స్నానం చేసి యమునికి నమస్కారం చేస్తే?