Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-02-2024 సోమవారం మీ రాశిఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం సఫలం

Lord shiva

రామన్

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ తదియ రా.10.41 పూర్వాభాద్ర రా.7.39 తె.వ. 4.38 ల 6.08. ప.దు. 12.36 ల 1.21 పు.దు. 2. 52 ల 3.37.
శంఖరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- శ్రీమతి అభిప్రాయాలను తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. పాత సమస్యలు పరిష్కార మార్గంలో సాగుతాయి. తొందరపాటు చర్యల వల్ల వ్యవహారం బెడిసికొట్టవచ్చు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఇబ్బందు లెదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది. హోటల్, కేటరింగ్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించాలి. మీరు ఇచ్చే సలహాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. 
 
మిథునం :- తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, ఏ వ్యవహారం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు.
 
కర్కాటకం :- స్త్రీలకు కాళ్ళు, నడము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
 
సింహం :- కాంట్రాక్టర్లకు బిల్లులు వాయిదా పడతాయి. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయాలలోవారికి అభిమాన బృందాలు అధికమవుతాయి.
 
కన్య :- బంధువులను కలుసుకుంటారు. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు.
 
తుల :- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఋణం తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు.
 
వృశ్చికం :- ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేక పోతారు. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించు కోగలుగుతారు. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
ధనస్సు :- వైద్యరంగాల వారికి అన్నివిధాలా శుభం కలుగుతుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహరాలు వాయిదా పడే సూచనలున్నాయి.
 
మకరం :- వృత్తిపరమైన చికాకులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో మెళకువ అవసరం. ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. ధాన్యం, అపరాలు, కంది, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చేకాలం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కుంటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయభేధాలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
 
మీనం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-02-2024 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం...