Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-02-2024 శనివారం దినఫలాలు - లక్ష్మీనారాయణస్వామిని ఆరాధించిన శుభం....

horoscope

రామన్

, శనివారం, 10 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ పాఢ్యమి తె.3.27 ధనిష్ఠ రా.11.01 తె.వ.5.42. ఉ. దు. 6.35ల 8.06.
లక్ష్మీనారాయణస్వామిని ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ధనం ఏ కొంతైనా సద్వినియోగమవుతుంది. అపరిచిత వ్యక్తులను దూరంగా ఉంచటం మంచిది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో మెళకువలు గ్రహిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం :- దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పోస్టల్, ఎల్బీసి ఏజెంట్లకు ఒత్తిడి, త్రిప్పట అధికం.
 
మిథునం :- ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు అధికం. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఫైనాన్సు, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
 
కర్కాటకం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న రీతిలోపూర్తి చేస్తారు.
 
సింహం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
కన్య :- సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం తక్కుతుంది. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు.
 
తుల :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు ఆశాజనకం.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. మీరు చేపట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొన్నా జయం మిమ్మల్ని వరిస్తుంది.
 
ధనస్సు :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు.
 
మకరం :- స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. దూరప్రాంతలకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో కలిసి సంప్రదింపులు జరుపుతారు. ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు.
 
కుంభం :- తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. రిప్రజెంటివ్‌లు మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
మీనం :- మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విద్యార్థులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్థులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చిలో శుక్రదశ.. ఈ మూడు రాశుల వారికి కేంద్ర త్రికోణ రాజయోగం!