Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-06-2022 శుక్రవారం రాశిఫలాలు ... లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Advertiesment
astro11
, శుక్రవారం, 10 జూన్ 2022 (04:00 IST)
మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయడం మంచిది కాదు. మీ హోదాను చాటుకునేందుకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. వ్యవసాయ కూలీలు, ముఠా కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయత్న పూర్వకంగా నిరుద్యోగులకు అవకాశం కలిసివస్తుంది. విదేశీ చదువుల యత్నంలో విద్యార్థులు సఫలీకృతులవుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ప్రయాణం, కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
మిథునం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. శ్రమ పడ్డా ఫలితం దక్కించుకుంటారు.
 
కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. గృహ మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
సింహం :- కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు.
 
కన్య :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విందులు, దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు.
 
తుల :- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. మీ రాక బంధువులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. దైవారాధన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
ధనస్సు :- వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
మకరం :- రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోకవలసి వస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. వ్యాపారాలు, సంస్థల అభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
కుంభం :- హోటలు, తినుబండ వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలకు టివి ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
మీనం :- మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలు షాపింగ్లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-06-2022 గురువారం రాశిఫలాలు ... సాయిబాబాను ఆరాధించిన సంకల్పసిద్ధి...