Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-06-202 ఆదివారం దినఫలాలు- ప్రేమికుల ఆలోచనలు...?

Advertiesment
Sagitarus

రామన్

, ఆదివారం, 9 జూన్ 2024 (05:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ తదియ సా.4.22 పునర్వసు రా.9.26 ఉ.వ.9.03 ల 10.42. సా.దు.4.43 ల 5.35.
 
మేషం:- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాలలో బ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయిన వారితో మీ సమస్యలు చెప్పుకుంటారు.
 
వృషభం:- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజకీయ నాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్లు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలసి వచ్చేకాలం. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. 
 
మిథునం:– సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. 
 
కర్కాటకం:- వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచనలుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెలకువ వహించండి. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
సింహం:- ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్ లకు సదవకాశాలు లభిస్తాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
కన్య:- పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేర గలవు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. మీ చిన్నారుల కోసం ధనంవిరివిగా వ్యయం చేస్తారు. రవాణా రంగాల వారికి మెళుకువ అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం.
 
తుల:- ఎ.సి, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. మీ సంతానం రాకకోసం ఎదురు చూస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనిపిస్తుంది. ప్రయాణాలు చివరిలో వాయిదాపడతాయి. 
 
వృశ్చికం:- పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయా లేర్పడతాయి. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. శత్రువులు మిత్రులగా మారి సహాయం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలుతప్పవు. 
 
ధనస్సు:- బంధు మిత్రులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది.
 
మకరం:- ఆర్ధికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వృత్తి వ్యాపారాలలో గణనీయమైన అభివృద్ధిని పొందుతారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం:- ఆర్ధిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు.
 
మీనం:- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల సమాచారం అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-06-2024 నుంచి 15-06-2024 వరకు మీ వార రాశిఫలాలు