Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-09-2023 గురువారం మీ దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్ప సిద్ధి

Advertiesment
kanya rashi
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (04:00 IST)
మేషం :- హామీలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితులు అనుకూలతలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. 
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి పొందుతారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో ఒకదానిలో వచ్చిన నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు.
 
మిథునం :- లౌక్యంగా పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు పనులు పూర్తి చేస్తారు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేక పోతారు. ఆస్తివ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహనలోపిస్తుంది.
 
కర్కాటకం :- పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదావేయటం మంచిది.
 
సింహం :- ప్రేమికులకు మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు.
 
కన్య :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. విద్యుత్, రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఇతరుల వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు, బంగారం సమకూర్చుకుంటారు.
 
వృశ్చికం :- అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు వాయిదాపడతాయి.మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది.
 
ధనస్సు :- రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా ఆలోచన లుంటాయి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వస్తుంది. ప్రయాణాల్లో తొందర పాటుతనం అంత మంచిది కాదని గమనించండి.
 
మకరం :- దంపతులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
కుంభం :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
మీనం :- ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆర్యోగంలో చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి. బ్యాంకు పనులు విసుగు కలిగిస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు నిరుత్సాహం తప్పదు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-09-2023 బుధవారం రాశిఫలాలు - శ్రీ కృష్ణుని ఆరాధించిన శుభం...