Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-09-2023 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించినా...

Advertiesment
Rishabham
, శనివారం, 2 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ బ|| తదియ రా.1.15 ఉత్తరాభాద్ర సా.5.22 తె.వ.4.45 ల
 
మేషం :- ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి స్వల్ప చికాకులు మినహా సమస్యలుండవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆర్యోగంలో చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులు అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రణాళికా బద్దంగా వ్యయం చేయవలసిన సమయం. ఆస్తి వ్యవహారాలలో ప్రయోజనాలు కానవస్తాయి. కుటుంబంలో ఉల్లాసకరమైన వాతావరణం నెలకొంటుంది. అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
 
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. నూనె, మిర్చి, కంది స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ సన్నిహితులు వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశంఉంది.
 
కర్కాటకం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. బ్యాంకు వ్యవవహారాలు మందకొడిగా సాగుతాయి. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికిపురోభివృద్ధి. దైనందిన కార్యక్రమాలలో మార్పుండదు. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. 
 
సింహం :- కపటంలేని మీఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల చికాకులు అధికం. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడగలవు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటంమంచిది. 
 
కన్య :- మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెద్దలు, మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికమిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గత తప్పిదాలు పునరావృతం కానున్నాయి.
 
తుల :- కాంటాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో మెళకువ అవసరం. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు.
 
వృశ్చికం :- ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయమవుతుంది. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు.
 
ధనస్సు :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించక పోవటంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
 
మకరం :- కీలమైన వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. మొండి బాకీలు వసూలలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
కుంభం :- ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడ మంచిదికాదు. నిరుద్యోగులకు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనాలు అనుకూలిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మీనం :- స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధిమవుతయి. రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి ప్రధాన ద్వారం వద్ద నేమ్ ప్లేట్ వుండాలా? డస్ట్ బిన్ వుండాలా?