Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-09-2025 శనివారం ఫలితాలు - మనోధైర్యమే శ్రీరామరక్ష...

Advertiesment
daily astrology

రామన్

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (05:05 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. దుబారా ఖర్చులు విపరీతం. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా యోగదాయకమే. లక్ష్మం సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దూరప్రయాణం తలపెడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా తీసుకోండి. పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పత్రాలు అందుతాయి. ఖర్చులు సామాన్యం. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో మెలకువ వహించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మనోధైర్యమే శ్రీరామరక్ష. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అతిగా ఆలోచింపవద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి పెడతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చిత్తశుద్ధిని చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆత్మస్థైర్యంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లలకు శుభం జరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారం అనుకూలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆచితూచి అడుగేయాలి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చేయవలసినవి, చేయకూడనివి