Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-08-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

Advertiesment
astro10
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (04:01 IST)
మేషం :- ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బాకీలు, ఇతరత్ర రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం.
 
వృషభం :- ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆశక్తి చూపిస్తారు. రవాణా, ఎగుమతి, ఆటోమొబైల్ రంగాల వారికి చికాకులు తప్పవు. మీ శ్రీమతి కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
మిథునం :- వ్యాపారాలను సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. స్త్రీలకు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసివస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
కర్కాటకం :- ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు. రాజకీయ, కళారంగాల్లో వారికి కలిసిరాగలదు. నిత్యావసర వస్తువ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. శతృవులపై విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ప్రయాణ రీత్య ధన వ్యయం మానసిక ప్రశాంతత కరువగును. 
 
సింహం :- వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రియతములతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆకస్మిక ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
కన్య :- బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. విద్యార్ధుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారంఉంది.
 
తుల :- విదేశాయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రక్టులు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. మీ ఆలోచనలు పలు విధాలుగాఉంటాయి.
 
వృశ్చికం :- కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిలస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆంతరంగిక విషయాలు, పథకాలు గోప్యంగాఉంచండి.
 
ధనస్సు :- ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం, విరక్తి కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. స్త్రీల ఓర్పు, ఏకాగ్రతలకు ఇది పరీక్షా సమయం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మకరం :- వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. విద్యార్థినులకు పాఠ్యాంశాల కంటే ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం :- రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. నూతన పరిచయాలేర్పడతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మిత్రులను కలుసుకుంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
మీనం :- పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రియతముల రాక సమాచారం, మీకు ఎంతో సంతోషాన్నికలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీ, పురుష రాశులు ఏవి.. మిథునరాశిలో స్త్రీ జన్మిస్తే..?