Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-09-2023 నుంచి 31-09-2023 వరకు మీ మాస ఫలితాలు

Advertiesment
Weekly astrology
, గురువారం, 31 ఆగస్టు 2023 (18:41 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
గ్రహబలం బాగుంది. సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారానుకూలత ఉంది. బాధ్యతగా మెలగాలి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. కీలక పత్రాలు అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యవసాయ కూలీలకు నిరాశాజనకం. విందులు, వేడుకలకు హాజరవుతారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం శుభదాయకం. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాలలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఇతరుల విషయంల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వస్త్ర, బంగారం, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రతికూలతలు తొలగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. మీ సాయంతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం బాగుంది. అన్ని రంగాల వారికీ యోగదాయకమే. వాగ్ధాటితో రాణిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. హామీలు నిలబెట్టుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెళకువ వహించండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. పదవీ విరమణ చేసిన వారికి వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. దంపతుల మధ్య అకారణ కలహం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితమీయవు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వేడుకలు, విందులకు హాజరవుతారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రియతములు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో కొత్త సమస్యలెదురవుతాయి. సామరస్యంగా మెలగండి. పత్రాల్లో మార్పుచేర్పులకు అనుకూలిస్తాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. గృహ అలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు. ఉపాది పథకాలు చేపడతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వస్త్ర, పచారీ, వెండి, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్థిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం విద్యాయత్నాలు ఫలించవు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఇంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. లభ్యమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దైవకార్యం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దైవకార్యాలకు విపరీతంగా చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వస్త్ర, పచారీ, వెండి, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-08-2023 గురువారం రాశిఫలాలు - గురుచరిత్ర పారాణయం చేసి...