Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-10-2019- శుక్రవారం మీ రాశిఫలాలు...

Advertiesment
25-10-2019- శుక్రవారం మీ రాశిఫలాలు...
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (10:00 IST)
మేషం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌‌‌‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తువేయటం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గౌరవప్రదమైన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది.
 
వృషభం: చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయనాయకులకు సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికమవుతాయి. గృహ ప్రశాంతత తమ చేతుల్లోనే ఉందని ఇరువురూ గ్రహించాలి. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు.
 
మిధునం: ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నధులు సమకూర్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ అభిప్రాయాలకు చక్కని స్పందన లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. పండగ అడ్వాన్సులు, సెలవులుపై ఉద్యోగస్తులు దృష్టి సాగిస్తారు.
 
కర్కాటకం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవాటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. రవాణా రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు సదవకాశాలు చేజారి పోతాయి. పాతవస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం: మధ్యవర్తిత్వాలు, వివాదాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ చిన్నారుల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఒక స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. 
 
కన్య: దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఊహాగనాలతో కాలం వ్యర్థం చేయక సత్‌‌కాలంను సద్వినియోగం చేసుకోండి. ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ యత్నాలకు మీ శ్రీమతి అండగా నిలబడతారు. మీ ఆశయ సాధనకు నిత్య కృషి, పట్టుదల అవసరం.
 
తుల: స్త్రీలలో ఒత్తిడి, హడావుడి చోటు చేసుకుంటాయి. ఎల్. ఐ.సి, ఫిక్సెడ్ డిపాటజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికందుతుంది. ఆకస్మిక పుణ్యక్షేత్ర సందర్శన వంటి ఫలితాలున్నాయి. ఏది జరిగినా మంచికేనని భావించాలి. బంధువుల రాక వల్ల మీ పనులకు ఆటంకాలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం.
 
వృశ్చికం: రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు క్షేమంకాదు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించక పోవడం మంచిది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. 
 
ధనస్సు: ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్శలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు, ఒత్తిడి ఎదుర్కుంటారు. ఏ విషయంలోను ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. ఆకస్మికంగా నగలను తాకట్టు పెట్టవలసివస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. 
 
మకరం: కోర్టుకు హాజరవుతారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. ఉద్యోగస్తులకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. కాంట్రాక్టర్లు, బిల్డిర్లు, పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం కానవస్తుంది.
 
కుంభం: సన్నిహితుల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. వ్యాపారాల్లో అమలుచేసిన స్కీములు మెరుగైన ఫలితాలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యములో సమస్యలను ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ లక్ష్యం నెరవేరదు.
 
మీనం: విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ రాకను మిత్రులు తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. మీ సంతానం మొండితనం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు పంచాంగం 25-10-2019.. శ్రీ మహాలక్ష్మీ పూజతో..?