Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-01-2021 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించినా...

Advertiesment
15-01-2021 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించినా...
, శుక్రవారం, 15 జనవరి 2021 (04:05 IST)
మేషం : బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. స్త్రీలతో మితంగా సంభాషించండి. వృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృషభం : ఆభరణాలు, వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం ఉత్తమం. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనకూలించదు. 
 
మిథునం :  వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటన లెదురవుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. 
 
కర్కాటకం : కానుకలు, నగదు బహుమతులతో షాపు పనివారలను సంతృప్తి పరుస్తారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆత్మీయులు, కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
సింహం : దైవ, సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రుణాలు తీరుస్తారు. కొత్త ఆలోచనలతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కన్య : కొన్ని సమస్యలు పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. హోటల్, తినుబండరాల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నయం చూసుకోవడం ఉత్తమం. 
 
తుల : ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం శ్రేయస్కరం. లీజు, ఏజెన్సీల, టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన చాలా అవసరం. మీ తోటివారికి బహుమతులు ఇచ్చి ఆకర్షించే యత్నం చేస్తారు. సేల్స్ సిబ్బంది, కొనుగోలుదార్లను ఓ కంట కనిపెట్టండి. దూరపు బంధువుల కలయిక చక్కని అనుభూతినిస్తుంది. 
 
వృశ్చికం : నమ్మినవారే మోసం చేయడం వల్ల ఆందోళన చెందుతారు. మీ ఉత్సాహాన్నిఅదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాలలో చికాకులు తప్పవు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. క్రీడా, కళా, రచన, పత్రికా రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. 
 
మకరం : ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. కిరాణా వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. 
 
కుంభం : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. ఏదైనా అమ్మకానికైచేయు ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. స్త్రీలకు ఇతరులతో పోటీపడాలనే ధోరణి మంచిదికాదు.
 
మీనం : వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. ప్రయాణ రీత్యా ధనవ్యయం, మానసిక ప్రశాంతత కరువగును. మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-01-2121 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడుని పూజించినా...