Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-11-2020 సోమవారం దినఫలాలు - సూర్య పారాయణం చేస్తే...

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 9 నవంబరు 2020 (04:30 IST)
మేషం : గృహంలో ఒక శుభకార్యం చేయాలనే సంకల్పం బలపడుతుంది. ప్రభుత్వోద్యోగులతో విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి. మెళకువ అవసరం. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎదుటివారితో మక్తసరిగా సంభాషిస్తారు. 
 
వృషభం : నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో మెళకువ అవసరం. స్త్రీలకు నూతన వ్యక్తుల పట్ల అప్రమత్త అవసరం. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. బ్యాంకింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం : విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్, వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళకువ వహించండి. కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారాలకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు మరింత బలపడతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
సింహం : వృధా ఖర్చులు మరింత అధికమవుతాయి. ప్రయాణాల్లో ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రింటింగ్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
కన్య : ఖర్చులు ఊహించినవి కావడంతో ఇబ్బందులు పెద్దగా ఉండవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. మిత్రుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచాయలేర్పడతాయి. 
 
తుల : తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్ట సమయాలలో సన్నిహితుల అండగా నిలుస్తారు. కోర్టు పనులు వాయిదాపడి నిరుత్సాహం కలిగిస్తుంది. ఖర్చులకు ఆదాయానికి పొంతన ఉండదు. కుటుంబ విషయాలు చర్చిస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసే అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు అలంకారాలు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో కొన్ని ముఖ్య విషయాల గురించి సంప్రదింపులు జరుపుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభాలబాటలో నడుస్తాయి. మిత్రులకు మీ సమర్థతపై నమ్మకం ఏర్పడుతుంది. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు కొంతకాలం వాయిదావేయడం మంచిది. ప్రేమికుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
మకరం : ఉపాధ్యాయులకు శ్రమాధిక్యతతో పాటు సంతృప్తి కానవస్తుంది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన దంపతు మధ్య సమస్యలు తలెత్తుతాయి. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా పూర్తిచేస్తారు. ఫ్లీడర్లకు చికాకులు తప్పవు.
 
కుంభం : స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
 
మీనం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తరు. ఉద్యోగస్తులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త అవసరం. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల ఓ సమస్య పరిష్కారమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-11-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఉమాపతిని ఆరాధిస్తే శుభం..