Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-06-2021 సోమవారం దినఫలాలు - మల్లికార్జున స్వామిని ఆరాధించినా...

Advertiesment
07-06-2021 సోమవారం దినఫలాలు - మల్లికార్జున స్వామిని ఆరాధించినా...
, సోమవారం, 7 జూన్ 2021 (04:00 IST)
మేషం : నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు చికాకులు తప్పవు. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. ఖర్చులు, చెల్లింపులు విపరీతంగా ఉంటాయి. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. 
 
మిథునం : చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీర్పు నిరుత్సాహం కలిగిస్తుంది. బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం లభిస్తుంది. 
 
కర్కాటకం : భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. లౌక్యంగా వ్యవహరించి మీ అవసరాలు చక్కబెట్టుకుంటారు. 
 
సింహం : గృహ మార్పులు, మరమ్మతులు చికాకు పరుస్తాయి. రిప్రజెంటేటివ్‍లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ టెక్నికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కన్య : ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 
 
తుల : మీ కుటుంబీకులపట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యవసాయ తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదాపడతాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
వృశ్చికం : కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
ధనస్సు : ప్రముఖుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. 
 
మకరం : ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకం. ప్రతి విషయంలోనూ ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. మిత్రులతో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రేమికుల క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. 
 
కుంభం : శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఐరన్, సిమెంట్, ఇసుకు, కలప, ఇటుకు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్యాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. 
 
మీనం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-06-2021 ఆదివారం రాశి ఫలితాలు - ఆదిత్యుడిని ఎర్రని పూలతో ఆరాధించినా...