Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-08-2021- శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఈశ్వరునికి తైలాభిషేకం...?

06-08-2021- శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఈశ్వరునికి తైలాభిషేకం...?
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (05:00 IST)
ఈశ్వరునికి తైలాభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. నిరుద్యోగులు చిన్న సదవకాశము లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
మిథునం: నూతన ఎగ్రిమెంట్లు, స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. 
 
కర్కాటకం: రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. నిర్మాణ పనుల్లో స్వయం పర్యవేక్షణ చాలా అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రుణం తీర్చేందుకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. 
 
సింహం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. ఏదైనా అమ్మకానికి చేసే యత్నాలు వాయిదా పడగలవు. లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబీకులతో అవగాహన లోపం వంటివి ఎదుర్కొంటారు. వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడటం నిరుత్సాహానికి కారణమవుతుంది. 
 
కన్య: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
తుల: ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో మెలకువ, ఏకాగ్రత అవసరం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృశ్చికం: స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది. ఆడిటర్లకు పురోభివృద్ధి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు దూరంగా వుండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: గృహానికి కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి సమస్యలను ఎదుర్కొంటారు.
 
మకరం: సైన్సు, గణిత రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయ రంగాల్లోని వారికి సంతృప్తి కనవస్తుంది. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. అవివాహితులకు అనుకూలమైన కాలం.
 
కుంభం: వ్యవసాయ రంగాల్లోని వారికి మెళకువ అవసరం. క్రీడా రంగాలల్లోని వారికి చికాకులు తప్పవు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. రాజకీయాల్లోని వారికి పార్టీ పరంగాను, అన్ని విధాల కలిసివస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం: కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాకీలు తీరుస్తారు. వస్త్ర, ఫోము, లెదర్, పీచు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-08-2021 గురువారం దినఫలాలు - అమ్మవారిని పున్నాగపూలతో...