Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బహిష్టులు హఠాత్తుగా ఆగిపోయాయా?

బహిష్టులు హఠాత్తుగా ఆగిపోయాయా?
, బుధవారం, 6 అక్టోబరు 2021 (09:02 IST)
బహిష్టులు కనపడకపోయినప్పటికీ అండం విడుదలయ్యే అవకాశం ఉందనే విషయం గమనించాలి. అంటే, నెలనెలా రుతురక్తం కనిపించకపోయినప్పటికి గర్భధారణకు అవకాశం ఉంటుందన్న మాట. నష్టార్తవం అనేది అసౌకర్యాన్నీ, ఆందోళననూ కలిగిస్తుంది కనుక దీని గురించి సమగ్రంగా తెలుసుకోవటం అవసరం.
 
గర్భధారణ (ప్రెగ్నెన్సీ):
శరీరంతర్గంతంగా హార్మోన్లలో తేడాలు సంభవించినప్పుడు బహిష్టులు ఆగిపోతాయి అందరకీ తెలిసిన హార్మోన్ల తేడా గర్భధారణ. మీరు వివాహిత అయ్యుండి. దాంపత్య జీవితాన్ని నిలకడగా కొనసాగిస్తున్నట్లయితే నష్టార్తవం సంభవించినప్పుడు ముందుగా మీరు ఆలోచించాల్సింది గర్భధారణ గురించే. అనుకున్న రోజుకు బహిష్టు రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్టు చేయిస్తే సరి.
 
గర్భనిరోధకమాత్రలదుష్ఫలితం:
గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో కొంతమందికి బహిష్టు స్రావం తగ్గిపోయే వీలుంది. మరికొంతమందిలో బహిష్టులు పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. గర్భనిరోధక మాత్రల వాడకం తప్పదనుకుంటే వాటి వల్ల ఇలా బహిష్టుస్రావాలు తగ్గిపోయే అవకాశం ఉందనిగుర్తుపెట్టుకుంటే చాలు. ఈ లక్షణం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.
 
బ్రెస్ట్_ఫీడింగ్
శిశువుకు పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల విడుదల కారణంగా నెలసరి కనిపించదు. ఈ కారణం చేతనే చాలా మంది తల్లులకు తమ పిల్లలకు పాలిస్తున్నంత కాలమూ బహిష్టులు కనిపించకుండా ఉంటాయి. శిశువుకు కనీసం ఆరునెలల వయసు వచ్చే వరకు తల్లికి తదుపరి గర్భధారణ జరగకుండా నిరోధించడానికి శరీరం ఎంచుకున్న సహజ గర్భనిరోధక విధానమిది, అలాగని, బిడ్డకు పాలిస్తున్నంత మాత్రాన నిశ్చయంగా గర్భం రాదని భావించకూడదు; ఇదొక అవకాశం మాత్రమేనని గుర్తించుకోవాలి.పూర్తి వివరాలు కు

పౌష్టికాహార_లోపం (మాల్ న్యూట్రిషన్):
ఎత్తుకుతగ్గ లావు లేకపోవటం, శక్తికి మించి శ్రమపడటం, లేదా అధికంగా వ్యాయామం చేయటం, సత్వరమే బరువుతగ్గే ప్రయత్నాలు చేయటం వంటి చర్యల వల్ల శరీరం తనకేదో 'కరువు' రాబోవుతున్నదని భావిస్తుంది.శక్తిని కాపాడుకునే నిమిత్తం అన్ని శారీరక విధులనూ తగ్గించేసుకుంటుంది.

దీని ఫలితంగా, మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంథి అప్రమత్తమై బహిష్టులను తాత్కాలికంగా నిలిచిపోయేలా చేస్తుంది. ఎనరెక్సియా, బులీమియా వంటి ఆహారసేవనకు సంబంధించిన రుగ్మతల్లో బహిష్టు స్రావం ఈ కారణం చేతనే కుంటుపడటాన్ని గమనించవచ్చు, శరీరం తాను ఉండాల్సినంత బరువుకు తాను చేరుకోగానే బహిష్టుక్రమాన్ని పునఃస్థాపించుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ ఎన్ని బాదం పప్పులు తీసుకోవచ్చు?