Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమెను చూస్తే మగాళ్లు అసూయపడతారు... ఎందుకో తెలుసా?

Advertiesment
ఆమెను చూస్తే మగాళ్లు అసూయపడతారు... ఎందుకో తెలుసా?
, బుధవారం, 8 జనవరి 2020 (15:54 IST)
ఫిట్‌నెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేహం చూడచక్కని ఆకృతితో వుండాలని ఆరాట పడుతున్నారు. దీనికి కారణం వ్యాయామం లేని జీవితం.. గంటల తరబడి కుర్చీల్లో అతుక్కుని కూర్చుని పనిచేయాల్సిన స్థితి. దీనితో మనుషులు ఊబకాయానికి తక్కువ స్థూలకాయానికి ఎక్కువ సైజుల్లో వుంటున్నారు. వద్దనుకున్నా వచ్చే బరువుతో చాలా భారంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి పరిస్థితే ఓ అమ్మాయికి ఏర్పడింది. ఆమె కోల్‌కతాకు చెందిన యూరోపా భౌమిక్. 
 
కౌమార దశలో ఆమె విపరీతంగా ఒళ్లు చేసింది. దీనితో తనతోటి స్నేహితులు... మోటూ... మోటూ(బండ) అంటూ గేలి చేయడం ప్రారంభించారు. తనను హేళన చేస్తున్నవారికి గుణపాఠం చెప్పాలంటే తన వళ్లు తగ్గించుకోవాల్సిందేనని నిర్ణయించుకున్న ఆమె తను వుంటున్న వీధి చివరిలో వ్యాయామశాలకు వెళ్లాలని నిర్ణయించుంది. ఈ క్రమంలో ఆమె తన శరీరాన్ని తగ్గించుకోవడమే కాదు ఆ తర్వాత బాడీ బిల్డింగ్ పైన దృష్టి పెట్టింది. 
webdunia
అలా 19 ఏళ్లకే అతి పిన్న వయస్కురాలైన బాడీ బిల్డర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెను ఎగతాళి చేసినవారు ఆమె శరీరాకృతిని చూసి ఆశ్చర్యపోయారు. తన ఫిట్నెస్ కోసం ఆమె చేసిన కఠోర శ్రమను చూసి శభాష్ అన్నారు. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదామె.

ఇక అసలు విషయానికి వస్తే 2020 నూతన సంవత్సరం సందర్భంగా ఆమె బాడీ బిల్డింగ్ చేసే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమెలా అమ్మాయిలు బాడీ బిల్డర్స్ కాకపోయినా మోటూల్లా మారకుండా ఆరోగ్యం కోసం వ్యాయాయమం చేయాలంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వులను శీతాకాలంలో ఎందుకు తీసుకోవాలంటే?