Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మగాడు ఇంటి పనులు చేయకూడదని ఆడవాళ్లే అంటూంటే ఇక పైకొచ్చేది ఎలా?

మగాడు ఇంటి పనులు చేయకూడదని ఆడవాళ్లే అంటూంటే ఇక మహిళలు పైకొచ్చేది ఎలా? అనేది కృష్ణ గారి కూతురు మంజుల బాధ. మగవాడు ఇంటి పనులు చేయకూడదని కొందరి మగవాళ్లల్లో ఉంటుంది.. కొందరు ఆడవాళ్ల ఫీలింగ్‌ కూడా అదే.. కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారిందని మగవాళ్లు ఇంటిపనుల

మగాడు ఇంటి పనులు చేయకూడదని ఆడవాళ్లే అంటూంటే ఇక పైకొచ్చేది ఎలా?
హైదరాబాద్ , బుధవారం, 8 మార్చి 2017 (03:49 IST)
మగాడు ఇంటి పనులు చేయకూడదని ఆడవాళ్లే అంటూంటే ఇక మహిళలు పైకొచ్చేది ఎలా? అనేది కృష్ణ గారి కూతురు మంజుల బాధ. మగవాడు ఇంటి పనులు చేయకూడదని కొందరి మగవాళ్లల్లో ఉంటుంది.. కొందరు ఆడవాళ్ల ఫీలింగ్‌ కూడా అదే.. కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారిందని మగవాళ్లు ఇంటిపనుల్లో సహాయం చేయడానికి వాళ్లే ముందుకు రావడం మంచి పరిణామమేన అని ఆమె భావన.

అదేసమయంలో మహిళలంగా మనకు ‘సూపర్‌ పవర్స్‌’ ఉన్నాయి. ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోవడం మగవాళ్ల వల్ల కాదు. మనల్ని మనం తక్కువగా ఊహించుకోకుండా ఉంటే ‘మగవాళ్లు ఎక్కువ’ అనే ధోరణిలో మార్పు తీసుకురాగలుగుతామని నా నమ్మకం అని ముక్తాయిస్తున్నారు మంజుల. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..
 
ప్రస్తుతం  ట్రెండ్‌ మారింది. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటి పనుల్లో హెల్ప్‌ చేయడానికి ముందుకొస్తున్నారు. మహిళలుగా వాళ్లకు ఆ ఛాన్స్‌ మనమే ఇవ్వాలి. కొందరు... ‘వద్దండీ. మీకెందుకు శ్రమ’ అంటారు. మగాళ్ల కంటే మనమే ఎక్కువ ఇదైపోతుంటాం. మనకూ ఈక్వల్‌ ఇంపార్టెన్స్‌ ఉండాలని మనం ఫీలవ్వాలి. అది లేనిదే ఏం చేయలేం. ఇప్పుడు మగవాళ్లు మారుతున్నారు. మా ఆయన మా అమ్మాయి డైపర్స్‌ ఛేంజ్‌ చేసేవారు. స్టడీస్‌ దగ్గర్నుంచి అమ్మాయి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లల బాగోగులు చూసుకోవడం తండ్రులకు లభించే గొప్ప గిఫ్ట్‌. ఐయామ్‌ నాట్‌ గుడ్‌ ఎట్‌ సీయింగ్‌ అకడమిక్స్‌. ఆయనే చూసుకుంటారు.  
     
కానీ నేను ఫీలయ్యేది ఏంటంటే... మనకి మనమే (మహిళలు) ఎక్కడో చిన్న భయాలు, ఓ రకమైన ఆలోచనలతో ఒకదానికి కట్టుబడిపోతున్నాం. కొందరు మహిళలు వాళ్లను వాళ్లే తక్కువ చేసుకుంటారు. ‘మనం ఎక్కువ’ అనే ఫీలింగ్‌ ఇన్‌సెక్యూర్టీని పోగొట్టి, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మహిళలకు అడ్డంకులు ఉన్నాయి. కాదనడం లేదు. ఏది ఏమైనా అమ్మగా, వర్కింగ్‌ విమెన్‌గా... రెంటినీ బ్యాలెన్స్‌ చేసుకోగల సామర్థ్యం మహిళలకే ఉంది. మనకు ‘సూపర్‌ పవర్స్‌’ ఉన్నాయి. ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోవడం మగవాళ్ల వల్ల కాదు. మనల్ని మనం తక్కువగా ఊహించుకోకుండా ఉంటే ‘మగవాళ్లు ఎక్కువ’ అనే ధోరణిలో మార్పు తీసుకురాగలుగుతామని నా నమ్మకం అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి అమేయమని చెబుతున్నారు మంజుల.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రా సమయానికి ముందు ఈ సూచనలు పాటిస్తే...