Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రా సమయానికి ముందు ఈ సూచనలు పాటిస్తే...

నేడు సమాజంలో అన్ని వయస్సుల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. ఐతే కొన్ని సూచనలు పాటించడం ద్వారా కమ్మని నిద్రను పొందవచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడిస్తే మంచిది. దీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియకూడా పెరగ

Advertiesment
health tips for good sleep
, మంగళవారం, 7 మార్చి 2017 (19:35 IST)
నేడు సమాజంలో అన్ని వయస్సుల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. ఐతే కొన్ని సూచనలు పాటించడం ద్వారా కమ్మని నిద్రను పొందవచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడిస్తే మంచిది. దీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియకూడా పెరగుతుంది. పడుకునే మంచం లేదా పడక ఏదైనాకావచ్చు మీకు నచ్చిన రీతిలో ఉండే విధంగా తయారుచేసుకోండి. మీకు ఇష్టమైన పడకనే ఏర్పాటు చేసుకోండి. లేకుంటే నిద్రలో తేడాలొచ్చి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు వైద్యులు. 
 
నిద్రపోయేముందు టీ- కాఫీ, శీతల పానీయాలు, మద్యం లాంటివి తాగడం మంచిది కాదు . దీంతో మస్తిష్కంలోని సిరలు ఉత్తేజం చెంది నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిద్రకు ఖచ్చితమైన సమయపాలన పాటించాలి. ఫలనా టైమ్ కు నిద్రపోవాలన్న నిబంధనను ఖచ్చితంగా అనుసరిస్తే శరీరం ట్యూన్ అవుతుంది. నిద్రబోయే ముందు కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు పెట్టుకోరాదు. కోపం తెచ్చుకునే పరిస్థితులు కల్పించుకోవద్దు. మనసు హాయిగా ఉంటేనే సుఖనిద్ర పడుతుంది. 
 
రాత్రి పూట నేర వార్తలు, సస్పెన్స్, థ్రిల్లర్స్, హారర్ వంటి వాటిని చూడటం – చదవడం వల్ల మూడ్ పాడవుతుంది. నిద్రాభంగం కూడా కలుగుతుంది. నిద్రపోయే ముందు జింక్ పుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు నిద్ర కూడా చెడిపోతుంది. నేటి యువతరానికి నిద్రా సమయంలో ఫేస్ బుక్, ట్విటర్, వాట్సప్ లను చూడటం ఒక వ్యాపకంగా మారిపోయింది. ఈ అలవాటు తెలియకుండానే నిద్రకు చేటు తెస్తుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను?