చాలామంది మహిళలు అందంకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో పెరుగును ఉపయోగించడంతో శరీర శుభ్రతతోపాటు అందంకూడా పెరుగుతుందంటున్నారు బ్యుటీషియన్లు. ముఖానికి పెరుగు పూసి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. దీంతో సన్‌బర్న్ బారిన పడకుండా ఉండగలరు.
** స్నానానికి ముందు బేసన్, పెరుగు మరియు కాసింత పసుపును కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంతోపాటు శరీరంపై పూర్తిగా అప్లై చేయండి. ఆ తర్వాత స్నానం చేయండి. దీంతో రోజంతా తాజాగా ఉండే అనుభూతి కలుగుతుంది.
** మీరు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల యుడుకొలిన్‌ను కలుపుకోండి. స్నానానంతరం శరీరం శుభ్రంగా ఉండటమే కాకుండా శరీరం సువాసనలు వెదజల్లుతుంటుంది.
** మీ వెంట్రుకలకు మరియు తలపైనున్న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మెంతులను రుబ్బి ఆ పేస్ట్‌ను తలపై పూయండి లేదా వేపాకుల పేస్ట్‌ను తలకు పూయండి. ఆ తర్వాత కొబ్బరి నీటితో మీ తలలోని వెంట్రుకలను కడగండి. దీంతో మీ తల వెంట్రుకలకు బలం చేకూరి నిగనిగలాడుతుంటాయి.
** తలకు హెన్నా రాయండి. ఇది వెంట్రులకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. దీంతోపాటు శరీరానికి చల్లదనాన్నిస్తుంది. ఒక మగ్గు నీటిలో ఒక నిమ్మకాయ రసం కలుపుకోండి. తల స్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలపై పోసుకోండి. ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా ఉంటాయి.