Article Woman Articles %e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b %e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%83%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82 107103000031_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడుపదులలో మాతృత్వం

Advertiesment
మూడుపదులలో మాతృత్వం
మూడు పదుల వయస్సులో మహిళలకు మాతృత్వం సత్ఫలితాలను ఇస్తుందని ఇటీవల జరిపిన అధ్యయనంలో తెలియవచ్చింది. చిన్నవయస్సులో తల్లులైన వారికన్నా ముప్పై సంవత్సరాలు పైబడిన మాతృమూర్తులు, మంచి తల్లులుగా మార్కులు పొందుతారని అధ్యయనం వెల్లడించింది.

ముప్పై సంవత్సరాల స్త్రీలు ఆర్థిక భద్రతను కలిగి ఉంటారని అధ్యయనాన్ని చేపట్టిన ప్రొఫెసర్ ఎలిజబెత్ గ్రెగొరి పేర్కొన్నారు. అంతేకాక వారు బాంధవ్యాలను పరిరక్షించడంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని అన్నారు. అప్పటికే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంతో వృత్తి వ్యాపకాలకు సంబంధించిన ఒత్తిడి 30 సంవత్సరాల మహిళలపై అంతగా ఉండదని తెలిపారు.

బ్రిటన్‌లో మహిళల సగటు గర్భధారణ వయస్సు 29 సంవత్సరాలకు చేరుకుంది. ఇక కుటుంబ జీవనాన్ని మొదలుపెట్టే వయస్సు 30ల చివరి నుంచి 40ల ఆరంభానికి చేరుకుంది. "ముప్పై సంవత్సరాలు పైబడిన మహిళలకు తమ ప్రాధాన్యతలను గాడిలో పెట్టుకునే అవసరం ఉండదు.

ఎందుకంటే వారు అప్పటికే తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకుంటారు. అందుకనే లేటు వయస్సులో మాతృత్వం అన్ని విధాల మంచిదని" ఎలిజబెత్ తెలిపారు. ఆర్థిక స్వాలంబనతో పాటు వారికి గల వృత్తిపరమైన అనుభవం, మహిళలలో నిర్వహణానైపుణ్యాలను పెంపొందించి ఇంటిని చక్కబెట్టుకోవడంలో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu