Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాసన పట్టే సామర్థ్యం కోల్పోతున్నారా.. అయితే మీరు ఫ్రెండ్స్‌కి దూరమైనట్లే మరి

డియర్ లేడీస్... జాగ్రత్తగా వినండి. బయటి ప్రపంచంతో మీ సబంధాలు సజావుగా సాగడానికి లేదా తగ్గిపోవడానికి మీలోని వాసస పట్టే సామర్థ్యంలో పెరుగుదల, తరుగుదలలే అసలు కారణమట. ఈ కారణంగానే వృద్ధ మహిళలకు బంధువులతో, స్నేహితులతో సామాజిక పరిచయాలు సన్నగిల్లిపోతున్నాయని

Advertiesment
Women’s
హైదరాబాద్ , శుక్రవారం, 24 మార్చి 2017 (04:08 IST)
డియర్ లేడీస్... జాగ్రత్తగా వినండి. బయటి ప్రపంచంతో మీ సబంధాలు సజావుగా సాగడానికి లేదా తగ్గిపోవడానికి మీలోని వాసస పట్టే సామర్థ్యంలో పెరుగుదల, తరుగుదలలే అసలు కారణమట. ఈ కారణంగానే  వృద్ధ మహిళలకు బంధువులతో, స్నేహితులతో సామాజిక పరిచయాలు సన్నగిల్లిపోతున్నాయని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వాసన పట్టే సామర్థ్యానికి స్నేహితులు దూరమవడానికి ఏంటి సంబంధం అని అడగబోతున్నారా. అసలైన పాయింట్ ఇక్కడే ఉంది మరి.


వాసన పట్టే సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే వారి సామాజిక జీవితం అంత ఎక్కువగా క్రియాశీలంగా ఉంటుందని వైద్యపరిశోధనలు చెబుతున్నాయి. ముదుసలులకు సామాజిక జీవితం తగ్గిపోవడానికి, వారిలో పాసన పట్టే సామర్థ్యం క్షీణించిపోవడానికి సంబంధం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
 
అమెరికాలోని స్వచ్చద పరిశోధనా సంస్థ మోనెల్ కెమికల్స్ సెన్సెస్ సెంటర్ పరిశోధకులు 57 - 85 సంవత్సరాల వయస్సు కలిగిన 3,005 మంది మహిళలనుంచి సేకరించిన డేటా పై విషయాన్ని ధ్రువపరుస్తోంది. వాసన పట్టడంలో వారు సాధించిన స్కోరు, వారి సామాజిక జివితాలకు సంబంధించిన డేటా వారు సేకరించారు. తర్వాత ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఘ్రాణ శక్తిని, వారి మొత్తం సామాజిక జీవితాన్ని వీరు పోల్చి చూశారు. సామాజిక జీవితం అంటే వారికి ఉన్న స్నేహితులు, దగ్గరి బంధువులు, వారు ఎంత తరచుగా కలుస్తున్నారు వంటి వాటితో కూడుకుని ఉంటుంది. 
 
అయితే ముసలమ్మల టెస్ట్ స్కోరును చూస్తే వారి ఘ్రాణ శక్తి పనితీరుకు, సామాజికి జీవితానికి మధ్య సమానమైన సంబంధం లేదని పరిశోధకులు కనుగొన్నారు. సామాజిక పరిచయాలు అనేవి వ్యక్తుల ఆరోగ్య స్థితితో ముడిపడి ఉంటాయని మనకు తెలుసు, కాబట్టి తక్కువ ఘ్రాణశక్తి కలిగిన ముసలమ్మలు తమ మొత్తం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి సామాజిక జివితాన్ని కొనసాగించడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారని మోనెల్ కెమికల్స్ సెన్సెస్ సెంటర్ పరిశోధకురాలు సాన్నె బోస్‌వెల్ట్ తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని ఒత్తిడి... భోజనం వేళ ప్రకారం చేస్తున్నారా లేదా...?